
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న మాధవ్ నగర్ సాయిబాబా దేవాలయంలో గురువారం రోజు దర్శనానికి వచ్చిన భక్తులకు బురద నీటి వల్ల తీవ్ర ఇబ్బంది గురికావాల్సి వస్తుంది. మొన్నటి వరకు రైల్వే లైన్ పనుల వల్ల ఇబ్బంది పడ్డ ప్రజలు ఇప్పుడు గుడి లోపల భాగంలో బురద నీటిలో నిలవడం వల్ల భక్తులకు ఇబ్బంది కావలసి వస్తుంది. ముఖ్యంగా పెద్ద వయస్సు గల వారికి మరీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పటికైనా ఆలయ సిబ్బంది గానీ ఎవరైనా దాతలు గాని ముందుకు వచ్చి ప్రాంగణంలో సిసి నిర్మాణం చేపట్టాలని అక్కడి భక్తులు కోరుతున్నారు.