నవతెలంగాణ -భిక్కనూర్
ముదిరాజ్ కులస్తులందరూ పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా ఉండాలని పట్టణ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు బండి రాములు అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ముదిరాజ్ కులస్తుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో అందరి సహకారంతో ముదిరాజ్ కళ్యాణమండపం నిర్మించడం జరుగుతుందని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని, రాజకీయ పార్టీల పేరుతో గ్రూపులుగా విడిపోవద్దని సూచించారు. అన్ని రాజకీయ పార్టీల సహకారంతో ముదిరాజ్ కళ్యాణమండపం నిర్మించడం జరుగుతుందని, ఇందుకోసం ప్రతి ఒకరు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. కొంతమంది వ్యక్తులు మాయ మాటలు చెప్పి తమ కులస్తులను ఇతర పార్టీలో చేరాలని చెప్పడం సరికాదని, తమ ఐక్యతను ఎవరు దెబ్బతీసిన సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం ప్రతినిధులు సభ్యులు పాల్గొన్నారు.