
దారిద్రరేఖకు దిగువన ఉన్న బీసీ కులాలను గుర్తిస్తూ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ, అందులో ముఖ్యంగా ముదిరాజులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారి సారధ్యంలో ముదిరాజ్ సంఘాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షంనీయమని ముదిరాజుల సంఘం జిల్లా అధ్యక్షులు బొల్లు దేవేందర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో విలేకరులకు మాట్లాడుతూ నేడు జరిగిన కేబినెట్ సమావేశంలో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న బీసీ కులాలను గుర్తిస్తూ ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించడం అందులో ముఖ్యంగా మా ముదిరాజులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించడం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, కృషిచేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు, బిసి సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యంగా ముదిరాజులను బీసీ “డి” నుంచి తొలగించి, బీసీ (ఏ) చేర్చాలని పేర్కొన్నారు. ముదిరాజుల పేదరిక నిర్మూలనకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టాలన్నారు.