ముదిరాజ్ మహాసభను విజయవంతం చేయాలి

Mudiraj should make the Mahasabha a successనవతెలంగాణ – రాయపర్తి
ముదిరాజ్ మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం మండలకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు బండారి శ్రీనివాస్, జిల్లా సొసైటీ డైరెక్టర్ చెవ్వు కాశినాధం మాట్లాడుతూ.. ఈనెల 15 నుండి 20వ తేదీ వరకు ప్రతి మండల కేంద్రంలో రెవెన్యూ అధికారుల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రాలు సమర్పించడం జరుగుతుంది అన్నారు. ముదిరాజుల చిరకాల వాంఛ అయిన బిసి డి నుండి బీసీ ఏ మార్చే ప్రక్రియలో తెలంగాణ ప్రభుత్వం సహకరించాలి అని కోరారు. రాష్ట్ర ప్రభుత్వంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని తమ న్యాయమైన డిమాండ్లను తీరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఏంఎస్ అధ్యక్షుడు ముద్రబోయిన సుధాకర్ ముదిరాజ్, మండల ఉపాధ్యక్షుడు షాపురం సాయిలు, మైలారం సొసైటీ అధ్యక్షుడు బోయిన కుమార్, జగన్నాథ్ పల్లి సొసైటీ అధ్యక్షుడు నారబోయిన యాకయ్య ముదిరాజ్, బురహాన్ పల్లి సొసైటీ అధ్యక్షుడు జంగిలి నరేష్ ముదిరాజ్, గన్నారం సొసైటీ అధ్యక్షుడు గూడెల్లి వెంకటయ్య ముదిరాజ్, కుక్కల రాములు ముదిరాజ్, రామ్మూర్తి ముదిరాజ్, గొడుగు యాకయ్య ముదిరాజ్, ముద్రబోయిన బిక్షపతి, బోయిని కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.