ముదిరాజులకే రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ ఛైర్మన్ పదవి ఇవ్వాలి

– ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు శ్రీనివాస్ ముదిరాజ్

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 

అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులకు రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని, కేవలం 10 శాతం కూడా లేని గంగపుత్రుడు అయిన సాయికుమార్ కు చైర్మన్ పదవి ఎలా ఇస్తారని హుస్నాబాద్ మండల ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు పొన్నబోయిన శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. సోమవారం అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముదిరాజు జాతికి సంబంధించిన మత్స్యకార సొసైటీలు దాదాపు 6000 పైచిలుకు ఉన్నాయని, అలాంటి ముదిరాజులను కాదనడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 37 కార్పొరేషన్లకు చైర్మన్ లను నియమించడాన్ని స్వాగతిస్తూనే ముదిరాజులకు అన్యాయం చేస్తూ గంగ పుత్రుడు అయినటువంటి మెట్టు సాయికుమార్ కు చైర్మన్ పదవి ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు.  ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచించి అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులకు రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పదవి  ఇవ్వాలని కోరారు.