
– రానున్న ఎన్నికల్లో ముదిరాజులు రాజకీయ రంగంలో సత్తా చాటాలి
– ముదిరాజుల భారీ బైక్ ర్యాలీ
– పెద్దపల్లి నియోజకవర్గంలో ముదిరాజుల 60 వేల మందిన ఏకతాటి పైకి రావాలి
– నూతనంగా నియామకమైన మత్స్య పారిశ్రామికసహకార సంఘం జిల్లా చైర్మన్ కొలిపాక నరసయ్య కొలిపాక శ్రీనివాస్
ముదిరాజులు రానున్న రోజులలో రాజకీయ రంగంలో తమ సత్తా చాటాలని రాజకీయ రంగంలో రాణించాలని నూతనంగా నియామకం అయిన మత్స్య సహకార సంఘం జిల్లా చైర్మన్ కొలిపాక నరసయ్య ముదిరాజ్ సంఘం జిల్లా నాయకులు కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శుక్రవారం నూతనంగా నియామకమైన కొలిపాక నరసయ్య ఆత్మీయ సన్మానం మహోత్సవ కార్యక్రమాన్ని స్థానిక ఎస్వీఆర్ గార్డెన్లో ఏర్పాటు చేయగా ముందుగా స్థానిక చెరువు కట్ట రోడ్డు నుండి ముదిరాజు సంఘస్తులు కొలిపాక నరసయ్యకు ఘన స్వాగతం పలికి భారీ బైక్ ర్యాలీతో బయలుదేరి ఎస్వీఆర్ గార్డెన్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మత్స్య సహకార సంఘం జిల్లా చైర్మన్ కొలిపాక నరసయ్య జిల్లా ముదిరాజ్ సంఘం నాయకులు కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గంలో ముదిరాజ్ సామాజిక వర్గం బలమైన వర్గంగా ఉందని దాదాపు 60 వేల ఓట్లు ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గం రానున్న ఎన్నికల్లో ఏకతాటి పైకి వచ్చి సంఘటిత శక్తిగా తయారై రాజకీయ రంగంలో రాణించాలని సూచించారు. అంతేకాకుండా ఇప్పటివరకు అన్ని పార్టీలు ముదిరాజు సామాజిక వర్గాన్ని ఓటు బ్యాంకుగా వాడుకొని నాయకులుగా ఎదిగారని ఆరోపించారు. రానున్న ఎన్నికల నాటికి ముదిరాజ్ సామాజిక వర్గానికి ఏ పార్టీ అయితే రాజకీయ రంగంలో ప్రాధాన్యత ఇస్తుందో ఆ పార్టీని గెలిపించేందుకు ప్రతి ఒక్క ముదిరాజ్ బిడ్డ ముందుకు రావాలని కొలిపాక నరసయ్య కొలిపాక శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లాలో మిగతా బీసీ కులాలను కలుపుకొని రాజకీయ రంగంలో రాణించేందుకు తగిన ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జిల్లా పరిషత్ చైర్మన్ తో పాటు ఎమ్మెల్యే తదితర పదవుల కోసం ముదిరాజ్ సామాజిక వర్గం సిద్ధంగా ఉండాలని తమ పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని వారు పేర్కొన్నారు. ఇప్పటివరకు ముదిరాజులు రాజకీయ రంగంలో ఎలాంటి ప్రాధాన్యత గల పదవుల్లో లేరని దానికి మన అనైక్యతే కారణమని సూచించారు. ముదిరాజ్ సామాజిక వర్గం పెద్దపల్లి నియోజకవర్గంలో బలమైన శక్తిగా ఎదిగితే అన్ని రాజకీయ పార్టీలను శాసించవచ్చని కొలిపాక నరసయ్య కొలిపాక శ్రీనివాస్ ఆశా భావాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ముదిరాజ్ అతిపెద్ద సామాజిక వర్గానికి ప్రభుత్వం ఎస్సీలకు దళిత బంధు పథకం ఏ విధంగానైతేనే అమలు చేస్తున్నారో ముదిరాజ్ బందును ప్రభుత్వం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. మీరందరూ ముందుకు వస్తే రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ముదిరాజ్ సామాజిక వర్గంతో పాటు యాదవ ఇతర కులాల మద్దతు తీసుకొని అన్ని వర్గాల సహాయ సహకారాలతో ముందుకు వెళ్తామని కొలిపాక నరసయ్య శ్రీనివాసులు పేర్కొన్నారు. పెద్దపల్లి నియోజకవర్గమే కాకుండా రాష్ట్రంలో ముదిరాజ్ సామాజిక వర్గానికి అన్ని పార్టీలు రాజకీయ రంగంలో ఎమ్మెల్యే పదవులతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ ఇతర నామినేట్ ఎమ్మెల్సీ రాజ్యసభ వంటి పదవుల్లో ముదిరాజ్ సామాజిక వర్గానికి ప్రాధాన్యత నివ్వాలని ప్రాధాన్యత ఇచ్చిన పార్టీల కె తమ మద్దతు ఇవ్వాలని వారు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా నూతనంగా నియామకం అయిన మత్స్య సహకార సంఘం జిల్లా చైర్మన్ కొలిపాక నరసయ్యను ముదిరాజ్ సంఘం నాయకులు గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కొలిపాక నరసయ్య, కొలిపాక శ్రీనివాస్,కొలిపాక సంధ్య చిరంజీవి, కొలిపాక సంపత్,జిల్లా డైరెక్టర్ వీరస్వామి,ముదిరాజ్ సంఘం నేతలు బోయిని రాజ మల్లయ్య గరిగంటి కుమార్ బాబు బోయిని శ్రీనివాస్, బోయిని వినోద్,పిట్టల రమేష్, కలువల శ్రీనివాస్ తో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన ముదిరాజ్ సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.