మార్కెట్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు 

నవతెలంగాణ భైంసా: భైంసా పట్టణం లోని మార్కెట్ గణేష్ మండలి ఆధ్వర్యంలో గురువారం చిన్నారులకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు, మన పండుగల విశిష్టత తెలియజేయాలన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. సరస్వతి శిశుమందిర్ సుభద్ర వాటిక, కిసాన్ గల్లి విద్యార్థులు పోటిల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో మండలి కమిటీ ప్రముఖులు శివ కుమార్ బచ్చువార్, నగేష్, శేష రావు పటేల్, శివ తదితరులు పాల్గొన్నారు.