మున్నూరు కాపు సంఘం ఆద్వర్యంలో ముగ్గులు పోటీలు…

– అన్ని కులాల మహిళలూ అర్హులే…
– మున్నూరు కాపు సంఘం మహిళా నేతలు..
నవతెలంగాణ – అశ్వారావుపేట
సంక్రాంతి సంబరాల్లో భాగంగా మున్నూరు కాపు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 12 ఆదివారం, మూడు రోడ్ల ప్రధాన కూడలి( రింగ్ రోడ్) సమీపంలో గల జిల్లా పరిషత్ ఉన్నత బాలురు పాఠశాలలో  ముగ్గుల పోటీని నిర్వహించడం జరుగుతుంది అని ఆ సంఘం మహిళా నేతలు పసుపులేటి భవాని,కర్నాటి రాధ,ఉపాద్యాయుల వరలక్ష్మి లు మంగళవారం విలేకర్లు సమావేశంలో ప్రకటించారు. ఈ ముగ్గుల పోటీల్లో కులాలకు అతీతంగా ముగ్గులు పై ఆసక్తి ఉన్న ప్రతీ మహిళా పాల్గొన వచ్చని,ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రతి ఒక్కరికి ఆకర్షణీయమైన గృహ అవసరాలకు సంబంధించిన బహుమతులను అందజేయడం జరుగుతుంది అని తెలిపారు.ముగ్గుల పోటీలలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి గా రూ.5116 తో పాటు జ్ఞాపిక, రెండవ బహుమతి గా రూ.3116 లు తనతో పాటు జ్ఞాపిక,మూడవ బహుమతి గారూ. 2116 లు తో పాటు జ్ఞాపిక అందజేస్తామని అన్నారు.
ఈ పోటీల్లో పాల్గొనే మహిళలు ఈ క్రింది నిబంధనలు పాటించాలని తెలిపారు.
1)చుక్కల ముగ్గులను మాత్రమే పరిగణల్లోకి తీసుకోవడంజరుగుతు
2)ముగ్గుల్లో పాల్గొనేవారం ఎవరి రంగులను వారే తెచ్చుకొనవలెను.
3)అనుభవజ్ఞులైన న్యాయ నిర్ణీతలదే తుది నిర్ణయం
4) ఆసక్తి కలిగిన వారు తమ పేర్లను ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకోవలెను
5) ఈ ముగ్గుల పోటీ ఆడవారికి మాత్రమే
6)ప్రతి ఒక్క సామాజిక వర్గానికి చెందిన మహిళలు ఆహ్వానితులే.
సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు:
1. పసుపులేటి భవాని ఫోన్ నెంబర్: 7995611574
2. కర్నాటి రాధా ఫోన్ నెంబర్:8074673304
3. ఉపాధ్యాయుల వరలక్ష్మి ఫోన్ నెంబర్: 8096730237