మహమ్మద్ నహీద్ అలీకి టీయూ డాక్టరేట్

నవతెలంగాణ డిచ్ పల్లి: తెలంగాణ యూనివర్సిటీ ఉర్దూ డిపార్ట్మెంట్ నుంచి మహమ్మద్ నహీద్ అలీ డాక్టరేట్ అందుకున్నారు. తెలంగాణ యూనివర్సిటీ ఉర్దూ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్, పాఠ్య ప్రణాళికల అధ్యక్షులు డాక్టర్ ముహమ్మద్ అబ్దుల్ ఖవి పర్యవేక్షణలో హైదరాబాద్ కె నామవార్ – సహాఫియూన్ కి అదబి వావ్ సహఫాతి ఖిడ్మాట్ (అజాది కె బాద్ )అనే అంశంపై సిద్ధాంత గ్రంథన్ని తెలంగాణ యూనివర్సిటీకి సమర్పించారు. ఈ బహిరంగ వైవాకు ఎక్స్ టర్నల్ గా ఎగ్జామినర్ గా ప్రొఫెసర్ డాక్టర్.సయ్యద్ అబ్దుల్ షూకుర్ పూర్వ విభాగాధిపతి ఉర్దూ విభాగం ఉస్మానియా యూనివర్సిటీ హాజరయ్యారు.
పరిశోధక విద్యార్థి భారత స్వతంత్రానంతరం హైదరాబాద్ కేంద్రంగా పనిచేసిన ప్రఖ్యాతి గాంచిన 25 మంది జర్నలిస్టుల జీవిత విశేషాలను, సాహిత్యానికి అందించిన సేవలను వివరనాత్మకంగా అధ్యయనం చేశారు. ప్రసిద్ధి చెందిన 25 మంది జర్నలిస్టులు ఉర్దూ సాహిత్యానికి, కళల అభివృద్ధికి వారు అందించిన తోడ్పాటును కులంకాషంగా తన సిద్ధాంత గ్రంథంలో విపలీకరించినారు. ఎక్సటర్నల్ ఎగ్జామినర్ ప్రొఫెసర్ శుకూర్ అడిగిన వివిధ ప్రశ్నలకు పరిశోధకుడైన మహమ్మద్ నహీద్ అలీ వివరాత్మకంగా సమాధానాలు చెప్పారు. స్వతంత్రానికి పూర్వం స్వతంత్రం తర్వాత జర్నలిజంలో వచ్చిన మార్పులు ఈ సిద్ధాంత గ్రంథంలో చర్చించారని జర్నలిజంలో ఉండే విలువలు సాహిత్యంలో ఉండే విలువలకు తేడాను సంబంధాన్ని పరిశోధకుడు స్పష్టంగా వివరించాడని ఎక్సటర్నల్ ఎగ్జామినల్ సంతృప్తి వ్యక్తం చేశారు.
పరిశోధకులు మహమ్మద్ నహీద్ అలీను  ఆర్ట్స్ డీన్. ప్రొఫెసర్ వి. త్రివేణి సాహిత్యం పై పలు అనుబంధ ప్రశ్నలు అడిగి ఈ సిద్ధాంత గ్రంథం ఉద్దేశాలను జర్నలిజంలో ఉండే విధంగా అనువర్తింప చేయాలని సూచించారు. హైదరాబాద్ కె నామవార్ – సహాఫియూన్ కి అదబి వావ్ సహఫాతి ఖిడ్మాట్ (అజాది కె బాద్)అనే అంశంపై పరిశోధన చేసినందుకు తెలంగాణ యూనివర్సిటీ రిజిస్టార్ ప్రొఫెసర్ డాక్టర్ యాదగిరి పరిశోధక విద్యార్థిని, పర్యవేక్షకుడిని అభినందించారు. ఈ సందర్భంగా పరిశోధక విద్యార్థి తనకు ఉన్నత విద్యను అందుకోవడానికి నిరంతరం ప్రోత్సహించిన తన తల్లితండ్రులకు, కృతజ్ఞతలు తెలియ చేశారు . మహమ్మద్ నహీద్ అలీ తన పరిశోధనలకు ఎప్పటికప్పుడు ముందుకు వెళ్లేలా కృషి చేసిన మిత్రులకు, పూర్వ డీన్ ప్రొఫెసర్ పి కనకయ్య కు ఉర్దూ విభాగం హెచ్ ఓ డి ప్రొఫెసర్ ముమ్మద్ మూస ఖురేషి,డాక్టర్ గుల్ -ఈ -రానా, హిందీ డిపార్ట్మెంట్ అధ్యాపకులకు జ్ఞాత, అజ్ఞాత మిత్రులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు.