– బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు
– సీఎల్ శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ-తలకొండపల్లి
మతసామరస్యానికి ప్రతీకగా మొహర్రం పడుగ అని బీఆర్‌ఎస్ కల్వకుర్తి సీనియర్ నాయకులు, మండల మాజీ ఎంపీపీ సీఎల్ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం తలకొండపల్లి మండల పరిధిలోని వెల్జాల్ గ్రామంలోనీ పీర్ల చావిడిలో ప్రతిష్టించిన పీర్లను బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ సీఎల్ శ్రీనివాస్ యాదవ్ దర్శించుకుని, దట్టీలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యుద్ధంలో మరణించిన మహ్మద్ ప్రవక్త మనువలు హసన్, హుస్సేన్ త్యాగానికి గుర్తింపుగా నిర్వహించుకునే మొహర్రం ఉత్సవాలు జరుపుకుంటారని గుర్తు చేశారు. అనంతరం మతాలకతీతంగా ప్రజలు పీర్లకు నైవేద్యం సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో యాదయ్య, ఖాజా, శ్రీరామ్, శ్రీకాంత్, రమేష్, బాబా, రఫీ, పరంధాములు, ముజ్జు, శేఖర్ , సాయి తదితరులు పాల్గొన్నారు.