సీఎం నివాసానికి ముఖేష్ అంబానీ..

 

నవతెలంగాణ – ముంబయి: రిలయన్స్ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్‌ అంబానీ ఈరోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందేను ఆయన నివాసంలో కలిశారు. జులై 12న జరగనున్న తన కుమారుడు అనంత్‌ అంబానీ వివాహానికి హాజరుకావాలని ముకేశ్‌ అంబానీ సీఎంను ఆహ్వానించారు. ఆయనతో పాటు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ శిందేను కలిశారు. వారిని సాదరంగా ఆహ్వానించిన సీఎం కుటుంబసభ్యులు రాధికా మర్చంట్‌కు వినాయకుడి ప్రతిమను బహూకరించారు.