నవతెలంగాణ-మర్కుక్
ఉద్యాన పంటల సాగులో మల్చింగ్ ఎంతో లాభదాయకమని, పంటలో కలుపు నివారణకు ఎంతో దోహద పడుతుందని ఉద్యానవన శాఖ అధికారి సౌమ్య సూచించారు. సోమవారం మండల పరిధిలోని పాతూరు గ్రామంలో కూరగాయల పందిరిలో మల్చింగ్ వేసి బీర, కాకర పంటలను సాగుచేస్తున్న రైతు షాదుల్లా, కనకయ్య కూరగాయల పంటలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె రైతులకు పలు సలహాలు, చూచనలు చేశారు. అనంతరం అమె మాట్లాడుతూ రైతులు సాగు చేసిన మొక్కల చుట్టు ప్లాస్టిక్ మల్చింగ్ వేయలన్నారు. దీంతో సమగ్ర కలుపు నివారణ చేయొచ్చాన్నారు. సూర్యరశ్మిని నేరుగా కలుపు మొక్కలకు సోకకుండా చేయడం వల్ల కిరణజన్య సంయోగ క్రియ జరగక సుమారు 85 శాతం వరకు కలుపు నివారణవుతుందన్నారు. మొక్క చుట్టూ భూమిలో ఉండే తేమను ఆవిరి కాకుండా నివారించడం వల్ల వివిధ కాల పరిమితులు గల పంటలకు 30-40 శాతం వరకు నీరు ఆదా అవుతుందన్నారు. బిందు సేద్వ పద్ధతిలో కలిపి వాడితే అదనంగా 20 శాతం నీరు ఆదా అవుతుందన్నారు.