హైకోర్టు ప్రాంగణంలో మల్టీ స్పెషాలిటీ ఆరోగ్యశిబిరం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రి, స్వచ్ఛంద సేవా సంస్థ నిర్మాణ్‌ ఆర్గనైజేషన్‌ సహకారంతో తెలంగాణ స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ వైద్యసేవలను కొనసాగిస్తున్నది. ఈ నేపథ్యంలో శుక్రవారం హైకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మల్టీ స్పెషాలిటీ ఆరోగ్య శిబిరం, రక్తదాన శిబిరాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్‌ అరాథే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి సుజరు పాల్‌, అభినంద్‌ కుమార్‌ శావిలి తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ తెలంగాణ చైర్మెన్‌ ఎ.నర్సింహారెడ్డి, తెలంగాణ హైకోర్ట్‌ అడ్వొకేట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎ.రవీందర్‌ రెడ్డి, ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాకేష్‌ కుమార్‌ సహారు, నిర్మాణ్‌ వ్యవస్థాపక సీఈవో మయూర్‌ పట్నాల హాజరయ్యారు. హైకోర్టు న్యాయవాదులు, సిబ్బందికి వైద్యసేవలు, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు అందించేందుకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరం ద్వారా ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రికి వచ్చే రోగులకు అవసరమైన రక్తాన్ని అందజేయనున్నారు.