– సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్
– సీఐటీయూ ఆధ్వర్యంతో ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన
– ఆర్డీవోకు వినతిపత్రం అందజేత
నవతెలంగాణ-తాండూరు
మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేసి, గ్రామపం చాయతీ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించాలని సీఐ టీయూ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ కోరారు. సోమ వారం సీఐటీయూ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు తాండూర్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన తెలి పారు. అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్ 51 రద్దు చేయాలన్నారు. పంచాయతీ ఉద్యోగులకు ప్రతినెలా ఒకటవ తారీఖున వేతనాలు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. కారోబార్ బిల్ కలెక్టర్లకు ప్రత్యేక స్టేటస్ ఇవ్వాలన్నారు.వివిధ పంచాయతీలలో పనిచేస్తున్న సీనియార్టీ గల ఇతర సిబ్బందిని వారి అర్హతలను బట్టి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో తాండూర్ నియోజకవర్గం గ్రామపంచా యతీ కార్మికుల యూనియన్ నాయకులు జిలాని నర్సిం లు, శాంతమ్మ, వెంకటమ్మ, భీమయ్య,అంబరప్ప, రాము లు, షబ్బీర్, శామప్ప, చందు, లక్ష్మి, హరి, వెంకటప్ప, ల క్ష్మి, భీమమ్మ, గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.