నవతెలంగాణ-గోవిందరావుపేట
అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని దుంపలగూడెం గ్రామంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమా వేశం పిఎసిఎస్ చైర్మన్ పన్నాల ఎల్లారెడ్డి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా సీతక్క హాజరై మాట్లా డారు. రైతే రాజు అని చెప్పే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోకుండా, పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రైతులను అప్పులపాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పటికే వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వ కుండా మోసం చేస్తున్నాయన్నారు. ప్రభుత్వాలు, రైతన్న కష్టపడి పండించిన పంటకు కూడా ఆంక్షలు విధిస్తూ, మిల్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయకుండా, క్వింటాకు 10 కిలోల తరుగును విధిస్తూ రైతుల కష్టాన్ని దోచుకుంటున్నాయని ఆరోపించారు. ములుగు జిల్లాలో వరి ధాన్యం సాగు ఎక్కువ అని తెలిసిన మిల్లులను కేటాయించలేదన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా కొన్న ధాన్యపు బస్తాలు అక్కడే ఉన్నాయని, సరైన వసతులు లేక అకాల వర్షాల వల్ల తడిసిపోయాయన్నారు. వాహనాలు రాక రవాణా జరగక రైతులు వాహనాలకు డబ్బులు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. ఇసుక రవాణాకు ఉచితంగా దొరికే వాహనాలు ధాన్యాన్ని ఎగుమతి చేయడానికి దొరక్కపోవడం విడ్డూరమని అన్నారు. ములుగు లారీ అసోసియేషన్ కూడా రైతన్న పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు. సకాలంలో వాహనాలు పెట్టి ధాన్యాన్ని తరలించాలని వేడుకుంటు న్నామన్నారు. ప్రభుత్వాలు వెంటనే పండించిన ప్రతి గింజను తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, మిల్లర్ల ఆగడాలను అరికట్టాలని, కొనుగోలు కేంద్రా ల్లో సరైన మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేయా లని అన్నారు. రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయా లని, దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవాలి అని అన్నారు. పంట నష్టం వాటిల్లితే పరిహారం కల్పించాలని, లేదంటే రాస్తారోకోలు, ధర్నాలు చేస్తామని అన్నారు. కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్, జిల్లా నాయకులు కణతల నాగేందర్ రావు, పెండెం శ్రీకాంత్, జెట్టి సోమయ్య, పాలడుగు వెంకటకష్ణ, కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, ఆకుతోట చంద్రమౌళి, చింతనిప్పుల భిక్షపతి, వంగ రవి యాదవ్, గుండెబోయిన అనిల్ యాదవ్, సూదిరెడ్డి జనార్దన్ రెడ్డి, సూడి సత్తిరెడ్డి, సామ చిట్టిబాబు, బొల్లు కుమార్, మూడ్ ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.