
మహాముత్తారం మండలంలోని ములుగుపల్లి కాంప్లెక్స్ పరిదిలోగల జీలపల్లి,లింగపూర్,మాధారం,కొర్ లకుంట,వజినపల్లి, స్థంబంపల్లి ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు ఆదివారం విజ్ఞాన విహార యాత్రకి వెల్లారు, ఈ సందర్బంగా ఉపాధ్యాయులు,విద్యార్థులకి చారిత్రక కట్టడాలు,వేయి స్తంభాల గుడి, వరంగల్ కోట,భద్రకాళి ఆలయం, జూపార్క్, సైన్స్ సెంటర్, వంటి వాటిని వివరిస్తు చారిత్రక అంశాలు, సైన్స్ పై అవగాహన కలిపించారు, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు మట్లాడుతూ.. విజ్ఞాన విహార యాత్ర ద్వార విద్యార్థుల్లో మానసిక ఉల్లాసం, శాస్త్రీయ విజ్ఞానం పొందడం జరుగుతుందన్నారు.ఈ విజ్ఞాన విహార యాత్రలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు ,శిరీష, కృష్ణమోహన్, రవినాయక్, హనుమంతు, సు మలత, జ్యోష్ణ, రాజబాబు, కరుణ, మౌనిక, విద్యార్థులు పాల్గొన్నారు.