– తనుశ్ కొటియన్ సెంచరీ
లక్నో (ఉత్తరప్రదేశ్) : ముంబయి 27 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. రెస్టాఫ్ ఇండియాపై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన ముంబయి ప్రతిష్టాత్మక ఇరానీ కప్‌ను సొంతం చేసుకుంది. సర్ఫరాజ్ ఖాన్ (222), రహానె (97) మెరువగా ముంబయి తొలి ఇన్నింగ్స్‌లో 537 పరుగుల భారీ స్కోరు చేసింది. అభిమన్యు ఈశ్వరన్ (191), ధ్రువ్ జురెల్ (93) పోరాడినా రెస్టాఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులకే ఆలౌటైంది. తనుశ్ కొటియన్ (114 నాటౌట్) అజేయ సెంచరీతో ముంబయి రెండో ఇన్నింగ్స్‌లో 78 ఓవర్లలో 329/8 పరుగులకు డిక్లరేషన్ ప్రకటించింది. ఐదో రోజు ఆటలో సమయం లేకపోవటంతో ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ముంబయి చాంపియన్‌గా నిలిచింది. ద్వి శతక హీరో సర్ఫరాజ్ ఖాన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకోగా, ముంబయి కెప్టెన్ అజింక్య రహానె ఇరానీ కప్ ట్రోఫీని అందుకున్నాడు. 1997/98 తర్వాత ముంబయి ఇరానీ కప్‌ను సొంతం చేసుకోవటం ఇదే ప్రథమం. న