బహుసాటే జయంతి ఉత్సవాల కోసం ముమ్మర ఏర్పాట్లు

Mummara arrangements for Bahusate Jayanti celebrations– ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు: హాజరు ఉత్సవ కమిటీ నాయకులు దశరథ్
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని అన్న బాహుసాటే జయంతి ఉత్సవాల కోసం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ జయంతి ఉత్సవాలు ఈనెల 16న ఉదయం 11 గంటలకు జరుగుతాయని జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు హాజరవుతున్నట్లు అన్న బహు సాటే ఉత్సవ కమిటీ నాయకులు దశరథ్ తెలిపారు. జయంతి వేడుకలను దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున తరలివచ్చే జనాల కోసం భోజన వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు ఇతర ముఖ్య నాయకులు హాజరవుతారని ఆయన తెలియజేశారు.