పసర పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఎస్ ఐ ఏ కమలాకర్ తన సిబ్బందితో కలిసి ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ప్రతి వాహనం ను అపి క్షుణ్ణం గా సోదాలు నిర్వహిస్తూ వాహన దారుల యొక్క వివరాలు తెలుసుకోవటం జరిగింది.రెండు రోజుల క్రితం పోలీసు బలగాలకు , మావోయిస్టు లకు జరిగిన ఎదురు కాల్పులను దృష్టిలో ఉంచుకొని పై అధికారుల ఆదేశాల మేరకు ముమ్మర వాహన తనిఖీలు చేపట్టుతున్నామని ఈ సందర్బంగా ఎస్సై కమలాకర్ తెలిపారు. వాహనదారులు సహకరించాలని అన్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వాహనాలను ఆపి తనిఖీ నిర్వహించారు.