అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తా: స్వాతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి ముండ్రాతి శ్రీకాంత్.

నవతెలంగాణ-ధర్మసాగర్ 
స్టేషన్ ఘన్ పూర్  నియోజకవర్గంలో నాకు ఒక అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తానని  స్వాతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి ముండ్రాతి శ్రీకాంత్ కోరారు. బుధవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో గల  ప్రింట్ మీడియా అసోసియేషన్ లో స్వాతంత్ర అభ్యర్థి ముండ్రాతి శ్రీకాంత్ పత్రిక విలేకరుల సమావేశం  ఏర్పాటు చేసి మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాలకు నేను అండగా ఉంటానని  మనం ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాడాలని ఆకాంక్షించిన కోరికలు నెరవేరలేదని, వాటిని నెరవేరుస్తానని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేకమంది విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి తెలంగాణలో ఈరోజు ఏ ఒక్క చేసిన వాగ్దానం నెరవేర్చలేకపో యారు ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు తమ సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నారని , తెలంగాణ ప్రజలు ఎంతో నష్ట పోయారని ఈ తొమ్మిదిన్నర ఏండ్ల కెసిఆర్ పరిపాలనలో  మనం అనుకున్నది ఏం సాధించలేదన్నారు. కాబట్టి నాకు అవకాశం ఇస్తే అలాంటివి జరగకుండా చూసుకుంటా ప్రతి పేదవాడి కుటుంబనికి న్యాయం కోసం పోరాడుతానని నాకు పేదల కష్టాలు సుఖాలు ఏంటో నేను స్వయంగా చూసి తెలుసుకున్న వాడిని స్టేషన్ ఘన్పూర్ ప్రజలు నా అభ్యర్థిత్వాన్ని మన్నించి నాకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం విజయ కుమార్ , ఎం రాజు తదితరులు పాల్గొన్నారు.