
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ మున్సిపల్ అధికారుల, సిబ్బంది సహకారాన్ని మరువలేనని నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ అన్నారు. ఈ మేరకు ఆదివారం నిజామాబాద్ నగరంలోని మున్సిపల్ కార్యాలయంలోని మేయర్ ఛాంబర్ లో మేయర్ పదవి కాలంలో అనునిత్యం పిలిచిన వెంటనే స్పందించి ప్రజలలకు మెరుగైన సేవలు అందించటంలో భాగస్వాములైన కమిషనర్ దిలీప్ కుమార్ కి, అసిస్టెంట్ కమిషనర్ శంకర్కి, డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర కుమార్ కి, మున్సిపల్ ఇంజనీర్ మురళి కి డీసీపీ శ్యామ్ కుమార్ కి, మేనేజర్ జనార్దన్ కి, డి.ఇలకు, ఎ. ఇలకు శానిటేషన్ సూపెరవైజర్లకు, మెప్మా సిబ్బందికి శాలువాతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు.