
బుద్ధిష్టు సొసైటీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర శాఖ నూతన సంవత్సర క్యాలెండర్ ను మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా గురువారం ఆవిష్కరించరు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందు ప్రియా ఈ సందర్భంగా మాట్లాడుతూ విశ్వ మానవాళిని ప్రేమ హృదయముతో గెలిచిన గౌతమ బుద్ధుని మార్గంలో భారతదేశం నడవాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుద్ధుని ఆలోచన విధానంలోనే పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో బుద్ధవనం ఏర్పాటుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో, బుద్ధిష్టి సొసైటీ ఆఫ్ ఇండియా ప్రతినిధులు సాయం మౌర్య, రాజు, రాజన్న, రాజకుమార్, నరేందర్, జంగం శ్రీశైలం, సంజీవులు, యేసు రత్నం, కిషన్ సాయి, గౌతమ్, తదితరులు పాల్గొన్నారు.