
విద్యార్థులలో దాగివున్న ప్రతిభను వెలికి తీయడానికి బాలసభ నిర్వహిస్తారని మున్సిపల్ చైర్మన్ శాగంటి అనసూయ రాములు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాల సభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మునిసిపల్ చైర్మన్ శాగంటి అనసూయ రాములు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి కలలను వెలికి తీయడానికి ప్రభుత్వ ఆదేశానుసారం ప్రతి నాలుగవ శనివారం బాలసభ నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు వారిలో దాగి ఉన్న కలలను ప్రదర్శించడం జరుగుతుందన్నారు. సమాజంలో జరుగుతున్నటువంటి మహిళ వివక్షత పైన మూఢాచారాలపైన నాటికలు నృత్యరూపకాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో తెలంగాణ సంస్కృతి బోనాలతో డప్పులు, కోలాటం, ప్రదర్శించారు. విద్యార్థులకు చదువుతోపాటు వాళ్ళ ఉన్న కలను వెలికి తీయడానికి ఇటువంటి కార్యక్రమాలు ఉంటాయని దీనివలన విద్యార్థులు సర్వతోవికాసం పొందుతారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దామెర శ్రీనివాస్, ఉపాధ్యాయులు సోమయ్య, యాదయ్య, శ్రీనివాసచారి, విజయలక్ష్మి సత్తిరెడ్డి, దుర్గాప్రసాద్, ఆసిఫ్, భానుప్రియ తదితరులు పాల్గొన్నారు.