
చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం గ్రామంలో చౌటుప్పల్ వెస్ట్ ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలను బుధవారం చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు చౌటుప్పల్ మండల జడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్ రెడ్డిలు కలిసి ప్రారంభించారు. క్రీడాకారులను ఉద్దేశించి వెన్ రెడ్డి రాజు చిలుకూరి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసానికి ఉపయోగపడతాయని అన్నారు. దండు మల్కాపురం మాజీ సర్పంచ్ పబ్బురాజుగౌడ్ ఆధ్వరంలో నిర్వహిస్తున్న టోర్నమెంట్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్.దేవేందర్ చౌటుప్పల్ మండల పరిషత్ ఉపాధ్యక్షులు ఉప్పు భద్రయ్య పీఏసీఎస్ వైస్ ఛైర్మన్ చెన్నగొనీ అంజయ్య గౌడ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బోయ దేవేందర్ NSUI మండల అధ్యక్షులు, రాచకొండ భార్గవ్, తదితరులు పాల్గొన్నారు.