సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని బంగారిగడ్డ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ఉదయం 9:00 గంటల సమయానికి మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు అకస్మాత్తుగా సందర్శించారు. ఇటీవల గైనకాలజీ డాక్టర్ సూపరిండెంట్ మధ్య గొడవలు ఆయన సంగతి తెలిసింది. వైద్యుల మధ్య చిన్న తగాదాల వల్ల ఇష్టానుసారంగా ఒకరిపై ఒకరు ఫిర్యాదుల తోటి రోగులు ఇబ్బంది పడుతున్నారన్న సమాచారంతో హాస్పిటల్ ని సందర్శించానని విలేకరుల సమావేశంలో తెలిపారు.డాక్టర్లు సమయపాలన పాటించట్లేదని ఆగ్రహించారు.ఏ డాక్టర్ 9 గంటలకు విధులకు హాజరు కావట్లేదు అని తెలిపారు.రోగుల దగ్గరికి వెళ్లి అడిగితే  పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పారు.సరైన వైద్య సేవలు అందడం లేదని రోగులు ఆరోపించారు. ప్రతి రోజు 200 మంది రోగులు వైద్యం కోసం రావడం జరుగుతున్నదని అన్నారు.ప్రతిరోజు ఇద్దరు ముగ్గురు డాక్టర్లు వస్తున్నారని తెలిపారు. శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తో చర్చించి విధులకు సమయానికి రాని వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఉన్నతాధికారులు ఇరువురిపై త్వరగా విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ Md బాబా షరీఫ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుక్కల నరసింహ తదితరులు పాల్గొన్నారు.