నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు షామీర్పేట వాగునుండి వడపర్తి కత్వ ద్వారా భువనగిరి పెద్ద చెరువుకు వచ్చే రాచ కాలువను ఆదివారం భువనగిరి మున్సిపల్ చైర్మన్ పోత్తం శెట్టి వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడపర్తి కత్వ నుండి భువనగిరికి పెద్ద చెరువు కు వచ్చే కాలువ ఎలా ఉంది, నీళ్లు సరిగా భువనగిరి పెద్ద చెరువు వరకు వస్తున్నాయా లేదా, కల్వకు కంపచెట్లు ఉన్నాయా అని పరిశీలించారు. కొన్నిచోట్ల కాలువ మధ్యలో కొన్ని మట్టి కుప్పలు ఉన్నాయని, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో కాలువలో మటుకుప్పలను తొలగించేందుకు చర్యలు, అవసరమైన చోట్ల మరమ్మతులు చేయిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కూర వెంకన్న , అతహార్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బర్రె నరేష్, మంగ ప్రవీణ్ లు పాల్గొన్నారు.