అంబేద్కర్ నగర్ లో పర్యటించిన మున్సిపల్ ఛైర్మన్

నవతెలంగాణ – మంథని
మంథని మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ నగర్ లో మున్సిపల్ ఛైర్మన్ పెండ్రి రమా-సురేష్ రెడ్డి పర్యటించారు. వార్డు సందర్శనలో భాగంగా స్థానికంగా ఉన్న ప్రజలతో కలియ తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంథని మున్సిపాలిటీ లోని అన్ని వార్డులను శుభ్రపరచటంలో కీలకంగా పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు ఎక్కువ సంఖ్య లో ఉన్న అంబేద్కర్ నగర్ లో పారిశుద్ధ్యం పట్ల గత పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించటం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో డ్రైనేజీ లను శుభ్రం చేసి ప్రజలకు ఉన్న అసౌకర్యాలను తొలగించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సింగారపుకిష్టయ్య,బండారి ప్రసాద్, తదితరులతో పాటు వార్డు ప్రజలు,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.