కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్మన్..

నవతెలంగాణ – ఎల్లారెడ్డి: నాయని బ్రహ్మ సంఘా కమిటీ హాల్ మరియు నీలకంఠేశ్వర ఆలయం ప్రహరీ గోడకు ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ మాట్లాడుతూ ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ప్రతి కూల సంఘానికి 10 లక్షల రూపాయలు వ్యయంతో వివిధ సంఘాల కమిటీ హాల్ కు నిధులు స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ మంజూరు చేయించారని తెలిపారు. అదేవిధంగా పట్టణంలోని నీలకంఠేశ్వర ఆలయం ప్రహరీ గోడకు ఐదు లక్షల రూపాయలు వ్యయంతో నిర్మిస్తున్నాట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జీవన్, మున్సిపల్ ఏఈ వినోద్, బి ఆర్ ఎస్ ఎల్లారెడ్డి అధికార ప్రతినిధి రామప్ప, నాయన బ్రహ్మ ఎల్లారెడ్డి అధ్యక్షులు కుసలకంటి మహేష్, శ్రీనివాస్, పాండు, సంతోష్. దశరథం, సంఘ సభ్యులు పాల్గొన్నారు.