ప్రత్యేక పూజలు చేసిన మున్సిపల్ ఛైర్మన్

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట ను పురస్కరించుకొని సోమవారం మున్సిపల్ ఛైర్మన్ ఆకుల రజిత వెంకన్న  పలు దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిందువుల ఆరాధ్య దైవమైన  శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం మనందరికీ శుభదాయకం, ఆనందదాయకం, సంతోషకరమన్నారు. అనంతరం శ్రీ రామాలయం, హనుమాన్ దేవాలయం, శ్రీ కాశీ మరకత శివాలయం, దేవాలయాలతో పాటు అంబేద్కర్ చౌరస్తా,  లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఐలేని అనిత శ్రీనివాస్ రెడ్డి , కౌన్సిలర్లు  బోజు రమ రవీందర్, చిత్తారి పద్మ, వాలా సుప్రజా నవీన్ రావు వల్లపు రాజు , మాజీ ఎంపీపీ  ఆకుల వెంకన్న , పున్న సది, ఐలేని శంకర్ రెడ్డి, ఐలేని శ్రీనివాస్ రెడ్డి నాయకులు తదితరులు పాల్గొన్నారు.