
హుస్నాబాద్ పట్టణంలోని హనుమాన్ దేవాలయం, మరకత లింగేశ్వర స్వామి దేవాలయలో మంగళవారం మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. హుస్నాబాద్ ప్రజలందరూ ఆయురారోగ్యాలు పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు మున్సిపల్ చైర్మన్ రజిత తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, ఐలేని అనిత శ్రీనివాస్ రెడ్డి , చిత్తారిపద్మ, వల్లపు రాజు, ఐలేని శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.