ఇటీవల కామారెడ్డి జిల్లా కేంద్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో అశోక్ నగర్ రైల్వే గెట్ వద్ద గుంతలు ఏర్పడ్డగా కామారెడ్డి పాత పట్టణంకు నిత్యం రాకపోకలు జరుగుతున్నాయి. గుంతల వల్ల వాహనదారులకు ఉన్న ఇబ్బందులను గుర్తించిన ఆటో డ్రైవర్ హజరత్ అలీ రోడ్డుపై గుంతలను ఇటులకతో పూడ్చరు. ఆటో డ్రైవర్ చేసిన పనిని కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ ను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సామజిక భాధ్యతగా పనీ చేయాలనీ మున్సిపల్ చైర్మన్ కోరారు. అశోక్ నగర్ గుంతల విషయమై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ షబ్బీర్ అలీ ద్రుష్టికి తీసుకెళ్లడం జరిగిందనీ తెలిపారు. వెంటనే స్పందించిన షబ్బీర్ అలీ సోమవారం అశోక్ నగర్ లో 18, వ వార్డ్ మున్సిపల్ చైర్ పర్సన్ వెళ్లి అక్కడ పర్యటించి సమస్యను మున్సిపల్ అధికారులతో రోడ్డు గుంతను పూడ్చివేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, పాత శివ కృష్ణమూర్తి, చాట్ల వంశీ,పిడుగు మమత సాయిబాబా, సుగుణ, తదితరులు పాల్గొన్నారు.