
రైతులు అధైర్యపడవద్దని నీకు మేము అండగా ఉంటాం అని మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియా చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నేను కూడా రైతు బిడ్డనే అని నా వంతు రైతన్నలకు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు. ఈ యొక్క మాస్టర్ ప్లాన్ రద్దు విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ, తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు ల వద్దకు వెళ్లి మాస్టారు ప్లాన్ రద్దు చేయిస్తాం అన్నారు. బుధవారం మాస్టర్ ప్లాన్ లో భూములను కోల్పోతున్న రైతులు మున్సిపల్ కార్యాలయం వద్దకు వచ్చి మున్సిపల్ చైర్ పర్సన్కు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో, మున్సిపల్ కమిషనర్ స్పందన,కామారెడ్డి పట్టణ కౌన్సిలర్లు, రైతన్నలు తదితరులు పాల్గొన్నారు.