తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో పరిసరాల పరిశుభ్రతో పాటు వర్షపు నీరు నిల్వ ఉన్న చోట మట్టితో నింపే కార్యక్రమం నిర్వహించినట్లు మున్సిపల్ కమీషనర్ భాస్కర్ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడారు వార్డులలో పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉన్న చోట దోమలు వ్యాపిస్తాయని, వార్డులలో నిల్వ ఉన్న ప్రాంతాలలో నీటిని బయటకు పంపి నీరు నిల్వ ఉంచకుండా చూడాలని, వాడే ప్రతి నీటిని మూతలతో మూసివేయాలని అన్నారు. డెంగ్యూ, మలేరియా వంటి రోగాలు ప్రభలకుండా జాగ్రత్త పడాలని అన్నారు. మట్టి కాల్వలను తవ్వడం వంటి కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రభుత్వ రంగ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలో వాలంటీర్ల తో నీరు నిల్వ ఉన్న ప్రదేశాలలో నీరు తొలగించి, బ్లీచింగ్ చల్లడం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ అరుణ కుమారి, డాక్టర్ బ్లేస్సి , ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ అరవింద్ రెడ్డి, ఎస్ ఎస్ జి, ఆర్ పి, అంగన్వాడి నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.