నవతెలంగాణ – ఆర్మూర్
2023-24 ఆర్థిక సంవత్సరంలో ఉత్తమ వసూళ్ళు చేసిన బిల్ కలెక్టర్స్ కి మున్సిపల్ కమిషనర్ రాజు సోమవారం సన్మానించినారు. ఈ సంవత్సరం కూడ మంచి వసూళ్ళు చేయాలని ఈ సందర్భంగా ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ షేక్ అయుం,సీనియర్ అసిస్టెంట్ శేఖర్,, బిల్ కలెక్టర్లు రామ్ శంకర్,, సిహెచ్ గంగ మోహన్, సంగీత , ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.