నిజామాబాద్ మున్సిపల్ పరిధిలోని సిబ్బంది సమయపాలన పాటిస్తూ పారిశుద్ధ్య పనులను పకడ్బందీగా నిర్వహించాలని నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్ సూచించారు. ఈ మేరకు శనివారం ఉదయం నగరంలోని పారిశుద్ధ్య పనులను కార్పొరేషన్ కమిషనర్ మకరంద్ పరిశీలించారు. అదే విధంగా నగరంలోని పూలాంగ్, గోల్ హనుమాన్ జోన్ కార్యాలయాలను కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో హాజరు పట్టికను, రికార్డులను పరిశీలించారు. సమయపాలన పాటించకుండా సిబ్బంది విధులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. అనంతరం ఆర్సపల్లి లో గల రైల్వే గేట్ గ్రావెల్ పనులను మున్సిపల్ కమిషనర్ మకరంద్ పర్యవేక్షించారు. పనులలో నాణ్యత ఉండే వధంగా సంబంధిత సిబ్బంది చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధికారులు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.