నగరంలోని పలు డివిజన్లలో శుక్రవారం ఉదయం నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ మకరంద్ తనిఖీలు నిర్వహించారు. జోన్-1 కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. రోజువారీగా రికార్డులను వ్రాస్తున్నారా లేదా అని అడిగి వివరాలు సంబంధిత సిబ్బందిని తెలుసుకున్నారు. అదేవిధంగా డివిజన్ 13 లోని సర్వే నంబర్ 19 లేఅవుట్ ను నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ తోపాటు పట్టణ ప్రణాళిక అధికారి సత్యనారాయణ ఇతర అధికారులు సందర్శించారు.అనంతరం 34, 39వ డివిజన్లలో పర్యటించారు.ఆదర్శనగర్, దుబ్బ, సుభాష్నగర్, హమల్వాడి,గౌతంనగర్లో పారిశుధ్య పనులను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. వీధులన్నీ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా స్థానికులు రోడ్లపై నీళ్లు నిలిస్తున్నాయని కమిషనర్కు వివరించగా తక్షణమే అధికారులను ఆదేశించి సమస్యను పరిష్కంచారు. ఆయన వెంట పట్టణ ప్రణాళిక అధికారి సత్యనారాయణ,శానిటేషన్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్, సిబ్బంది మోహన్ తదితరులు పాల్గొన్నారు.