
పట్టణ పరిధిలోగల బేకరీల షాపుల పరిశుభ్రతను హలియా మున్సిపల్ కమిషనర్ మున్వర్అలీ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశుభ్రత పాటించకుండ, తాగేటి, తినేటి పదార్థాల యొక్క గడువు తేదీ ముగిసిపోయిన వాటిని విక్రయిస్తే జరిమానా విధిస్తామని అవసరమైతే షాపులను సీజ్ జేస్తామని హెచ్చరించారు. కమిషనర్ తో పాటు ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ రవికుమార్, బిల్ కలెక్టర్లు ఉమర్, శ్రీశైలంగౌడ్ పాల్గొన్నారు.