మొగ్పాల్ వాటర్ సప్లై ఫిల్టర్ బెడ్ ను నిజామాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్ శనివారం పరిశీలించారు. వాటర్ సప్లై ఫిల్టర్ బెడ్ ను కమిషనర్ క్షుణ్ణంగా తిరిగి ప్రతి ఒక్కటి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆలం బ్లీచింగ్ సరైన పద్ధతిలో కలపాలని అక్కడున్న సిబ్బందికి తెలిపారు. అక్కడున్న నీటిని స్వయంగా కమిషనర్ త్రాగి పరిశీలించారు. అదేవిధంగా ఫిల్టర్ బెడ్ ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని సూచించారు. ఫిల్టర్ బెడ్ చుట్టూ నీరు ఎలా సప్లై అవుతుందో చూశారు. వాటి చుట్టూ చెత్తాచెదారం ఉండకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయాలని అక్కడున్న సిబ్బందికి ఆదేశించారు. సిబ్బంది విధులలో నిర్లక్ష్యం వహించరాద అని సిబ్బందిని ఆదేశించారు. ఒకవేళ విధులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పదన్నారు.