నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ బుధవారం నగరంలో పలు ప్రాంతాలను పర్యటించారు. ఈ సందర్భంగా నగరంలో ప్రారంభమైన సమగ్ర కుటుంబ సర్వేను నిజామాబాద్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ పరిశీలించారు. రేడియో స్టేషన్ ప్రాంతంలోని న్యాల్ కల్ రోడ్డులో సర్వే చేస్తున్న సిబ్బంది వద్దకు వెళ్లారు. నిర్దేశిత ప్రొఫార్మ ప్రకారం వివరాల సేకరణ, నమోదు తీరుపై ఆరా తీసి సిబ్బంది సలహాలు, సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.