నవతెలంగాణ- జడ్చర్ల
మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ జిల్లా అధ్యక్షులు ఆకుల వెంకటేష్ అన్నారు. మంగళవారం జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డిని జడ్చర్ల క్యాంపు కార్యాలయంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) స్థానిక పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించి, రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో మున్సిపల్ కాంటాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయుటకు తమరి ద్వారా ప్రభుత్వానికి సిఫార్సు చేయవలసిందిగా కోరినారు, మున్సిపాలిటీలలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ సేవలను థర్డ్ పార్టీకి అప్ప చెప్పకుండా ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసం హరించుకోవాలని ఎమ్మెల్యే గారికి తెలిపినారు,అలాగే ప్రభుత్వం నిర్ణయించబోయే పిఆర్సీలో కనీస వేతనం 26 వేల రూపాయలుగా నిర్ణయించాలన్నారు. అలాగే జీవో నెంబర్ 60, 63లో సూచించిన విధంగా జడ్చర్ల మున్సిపల్ కార్యాలయంలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులకు కేటగిరీలవారిగా వేతనాలు అమలు చేయించాలని కమిషనర్ గారినీ ఆదేశించాలని తెలిపారు.కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పైన ఎమ్మెల్యే దష్టికి తీసుకు పోయినందున ఎమ్మెల్యే స్పందిస్తూ,రాబోయే2,3 రోజులలో మున్సిపల్ కార్మికుల తో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసుకొని మీ యొక్క సమస్యలన్నీ సంపూర్ణంగా వింటూ మీ సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బాద్మి శివకుమార్, కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు మీనాజుద్దీన్ , నిత్యానందం, యూనియన్ నాయకులు, కార్మికులు, జిల్లా అధ్యక్షులు ఆకుల వెంకటేష్,పట్టణ కమిటీ అధ్యక్షుడు మహేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ, కే కష్ణ, ఉపాధ్యక్షులు, అలివేలు, అంజమ్మ, కేశవులు, విజయకుమార్, ఫిట్టర్ యాదయ్య, ఎలక్ట్రీషియన్ కరీమ్, వాటర్‌మెన్, వెంకటయ్య, చంద్రమౌళి, బెల్లం జయమ్మ, అనురాధ, అనూష,అరుణ, కార్మికులు అందరూ పాల్గొన్నారు.