నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో, అకస్మాత్తుగా భారీ వర్షం సోమవారం మధ్యాహ్నం కొయ్యడంతో రైల్వే కమాన్ వద్ద భారీగా నిలిచిన నీరు, వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. ఈ నేపథ్యంలో వెంటనే స్పందించి, నగర పాలక సంస్థ కమిషనర్ మకరంద్, స్పెషల్ మాన్సూన్ టీమ్ తో తరలివచ్చి, వరద నీరు తొలగించడానికి సత్వర చర్యలు తీసుకున్నారు. అలాగే నగరంలో పూర్తిగా వరద నీరు తొలగింపు చర్యలు చేపట్టారు. వాహనాల రాకపోకల పునరుద్ధరణ జరిగేల చర్యలు తీసుకున్నారు. పోలీసులు, ఇతర లైన్ డిపార్ట్మెంట్ అధికారులు మున్సిపల్ అధికారులకు సిబ్బందికి సహకరించారు.