నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 50వ డివిజన్ శివాజీ నగర్ లో శుక్రవారం మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలో కాలనీవాసులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా డ్రైనేజీ సరిగ్గా లేని కారణంగా మురికి నీరు ఇళ్ల ముందు చేరుతున్నట్లు స్థానికులు తెలిపారు. కొత్త పైప్ లైన్, సీసీ డ్రైనేజీ నిర్మించాలని కార్పొరేటర్ కోరారు. కార్పొరేటర్ బట్టు రాఘవేందర్తో కలిసి పర్యటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్లు మహిపాల్, మున్సిపల్ సిబ్బంది కార్మికులు తదితరులు పాల్గొన్నారు.