మున్సిపల్ సర్వసభ్య సమావేశం ..

Municipal general meeting..– 39 అంశాల ప్రవేశం, ఆమోదం 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ నగరంలోని మున్సిపల్ కార్యాలయం లోని కౌన్సిల్ హాల్ లో నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ అధ్యక్షతన శనివారం చివరి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సర్వసభ్య సమావేశానికి నగర ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, కార్పొరేటర్లు, మున్సిపల్ ఆదికారులు హాజరయ్యారు. ఈ సమావేశములో గత 5 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్దిని మేయర్ దండు నీతూ కిరణ్ క్లుప్తంగా ప్రస్తావించి ఈ అభివృద్ధిలో భాగస్వాములైన మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త కి, నగర ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ కి, మాజీ ఎమ్మెల్సిలు, ఎంపీ, కార్పొరేటర్లు, ఆదికారులకు సర్వసభ్య సమావేశం ద్వారా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు. వాడవిడగా జరిగిన ఈ సమావేశం లో 39 ఎజెండా అంశాలను ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరి ఆమోదం మేరకు సభ్యుల మద్దతుతో ఆమోదం పొందినట్లు నగర మేయర్ దండు నీతూ కిరణ్ తెలిపారు.