అభివృద్ధి పనులపై మున్సిపల్ సమావేశం

నవతెలంగాణ – జమ్మికుంట
జమ్మికుంట మున్సిపల్ సమావేశము స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం మున్సిపల్ కమిషనర్ చైర్మన్హ తక్కలపల్లి రాజేశ్వరరావు అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశము నిర్వహించారు. ఈ సమావేశములో పట్టణంలోని పలు అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సమావేశమునకు 30వార్డుల  కౌన్సిలర్లు హాజరై 19 అంశాలపై చర్చించి ఆమోదము తెలిపారు. పురపాలక సంఘం కార్యాలయానికి గేటు నిర్మాణానికి, డిఆర్సిసి సెంటర్లో లైట్లు, సిసి కెమెరా, బోర్వెల్ మోటార్, పబ్లిక్ టాయిలెట్స్ మరమ్మత్తులు, పార్కులు, ఆబాది జమ్మికుంట బస్టాండ్ వద్ద పబ్లిక్ టాయిలెట్స్, మొదలగు పలు అభివృద్ధి పనులకు ఏకగ్రీవంగా ఆమోదము తెలిపినారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ ఆయాజ్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దేశిని స్వప్నకోటి తదితరులు పాల్గొన్నారు.