
– దశాబ్ది ఉత్సవాల్లో మహనీయుల విగ్రహాలు చీకట్లు..
నవతెలంగాణ – వేములవాడ
రాష్ట్రవ్యాప్తంగా దశాబ్ది ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో హట్టహాసంగా, ఘనంగా వేడుకలు నిర్వహిస్తుంటే వేములవాడ మున్సిపల్ కార్యాలయం, తిప్పాపూర్ లోని తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ చౌక్ ప్రధాన వీధుల్లో ఏర్పాటు చేసిన చిరస్మరణీయులైన మహనీయుల విగ్రహాలను విద్యుత్ దీపాలతో అలంకరించాల్సిన కోడళ్ళు ఎలాంటి విద్యుత్ లైట్లతో అలంకరించకుండా బోసు పోయి చీకట్లు ఉన్నాయి .విద్యుత్ దీపాలంకరణలతో కళ్ళు జిగేల్మనేలా రంగురంగుల పువ్వులతో, లైట్లతో అలంకరించాలి, తెలంగాణ తల్లి విగ్రహం మెడలో ఉన్న పాత పూల దండలు తొలగించకుండానే అలాగే బోసిపోయాయి. అధికారుల, పాలకుల నిర్లక్ష్యంతో ప్రధాన కూడలను అలంకరించడం మరిచారు. ఎందరో అమరవీరుల త్యాగాల పైన తెలంగాణ ఆవిర్భావం జరిగింది. విద్యుత్ దీపాలతో పూలతో అలంకరించకపోవడంతో పట్టణ ప్రజలు అధికారుల, పురపాలక సంఘం పాలకులపై, తెలంగాణ పోరాటం, అమరవీరులను అవమానించేలా అధికారుల తీరు ఉందని పట్టణ ప్రజలు, ఉద్యమకారులు మండిపడుతున్నారు.