నూతన కమిషనర్ను కలిసిన మున్సిపల్ యూనియన్ నాయకులు

నవతెలంగాణ – కామారెడ్డి
కామరెడ్డి మున్సిపల్ కు కొత్తగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ ని  మున్సిపల్ కార్మికుల యూనియన్ (సీఐటీయూ) నాయకత్వం మంగళవారం మర్యాదపూర్వకంగా పూల మొక్కను అందజేసి కలిశారు. కామారెడ్డి మున్సిపల్ కు కామరెడ్డి మున్సిపల్ కు కొత్తగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డిని, మేనేజర్ రమేష్ ని పూల మొక్క ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం చెప్పిన తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) కామారెడ్డి జిల్లా  మున్సిపల్ యూనియన్ లీడర్స్ కమిషనర్  కి నాలుగు నెలల ఈపీఎఫ్, ఈఎస్ఐ తో పాటు ప్రతినెల 5 వ తారీఖున జీతాలు అందే విధంగా చూడాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కే రాజనర్సు, జిల్లా కార్యదర్శి ఎండి మహబూబ్ అలీ, ఉపాధ్యక్షులు దీపక్,  ప్రభాకర్, కాట్రియాల ప్రభు,  దీవెన,  శివరాజవ్వ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.