తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ ఎంప్లాయిస్ శుక్రవారం చలో హైదరాబాద్ ధర్నా కార్యక్రమానికి భువనగిరి మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు మాయ కృష్ణ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఏళ్ల తరబడి మున్సిపల్ వార్డులలో శుభ్రం చేస్తూ ప్రజలకు వాళ్ల ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజల కాపాడుతున్నారన్నారు. ధరలకు అనుగుణంగా జీతాలు ఇవ్వడం లేదన్నారు. కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చి సంవత్సరం అవుతున్న కార్మికులకు ఎన్నికలలో హామీ ఇచ్చిన ప్రకారంగా హామీ ఇవ్వడం జరిగిందన్నారు. కాంగ్రెస్ గద్దెనెక్కినంక కార్మికుల సమస్యలు పట్టించుకోవడం లేదు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని పర్మిట్ చేయాలన్నారు. చలో సిడిఎమ్ఏ రాష్ట్ర కమిషనర్ కార్యాలయం ధర్నాకు వెళ్లడం జరిగింది కార్మికులు నిరసన వ్యక్తం చేస్తూ పనిని బందు పెట్టి కమిషనర్ కార్యాలయం కి వెళ్లడం జరిగిందన్నారు. రెండు డిసిఎంలో 115 కార్మికులు వెళ్లడం జరిగింది ఈ కార్యక్రమంలో పూదరి రామచందర్ బట్టు కొండయ్య సిద్ధంకి శంకర్ బాబు రేణుక సత్యమ్మ యాదమ్మ వరమ్మ శాంతమ్మ లక్ష్మీ నరసమ్మ రాము మల్లేశం కార్మికులు వెళ్లారు.