– సీఐటీయూ మున్సిపల్ కన్వీనర్ ఎల్లేష్
– కమిషనర్ రవీందర్‌సాగర్‌కు సమ్మె నోటీసు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, వారికి కనీస వేతనాలని సీఐటీయూ ఇబ్రహీం పట్నం మున్సిపల్ కన్వీనర్ ఎల్లేష్ డిమాండ్ చేశారు మున్సిపల్ కమిషనర్ రవీందర్ సాగర్‌ను శనివారం కలిసి సమ్మె నోటీసు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ విభాగాల్లో పని చేస్తున్న సిబ్బంది సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి ఇప్పటికే వివిధ రూపాల్లో వినతులు అందజేసినట్టు తెలిపారు. సమస్యలు పరిష్క రించకపోతే ఈ నెల8వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్తున్నామని చెప్పినా తమకేమీ పట్టనట్టు ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. ఆదివారం నుంచి సమ్మె చేయనునట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లారు యూనియన్ అధ్యక్షులు పెద్దగారి లక్ష్మయ్య, కార్యదర్శి బండారి యాదయ్య, మున్సిపల్ కార్మికులు కొండ్రు రాజు, యాచారం సురేష్, కపాటి రాజు, చెరుకూరి రాములు, స్వప్న, భాగ్య, తదితరులు పాల్గొన్నారు.