– శంషాబాద్ మున్సిపల్ కార్యాలయం
– వద్ద కార్మికుల నల్లబ్యాడ్జిలతో నిరసన
నవతెలంగాణ-శంషాబాద్
మున్సిపల్ శాఖ వివిధ విభాగాలలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని శంషా బాద్ మున్సిపల్ వర్కర్ల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చడం లో నిర్లక్ష్యంగా ఉన్న కారణంగా శంషాబాద్ మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం రూ.21 వేలు చెల్లించాలని ప్రమాద బీమా రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాలకు తక్షణ సాయం కింద ప్రస్తుతం ఇస్తున్న దాన్ని పెంచాలన్నారు. కార్మికులను అందర్నీ ఔట్సోర్సింగ్ నుంచి కాకుండా రెగ్యులరైజ్ చేయాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచుతూ మధ్యంతర మృతి ఇవ్వాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను తెలం గాణ ప్రభుత్వం సానుకూల దృక్పథంతో పరిష్కరించాలని లేదంటే ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిం చారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా సలహాదారు డి. నాగేష్ వై. నరసింహ, బి. బాబురావు, మొయినుద్దీన్, నరేందర్, పి. శివ, కే. దశరథ్, కుమార్, సంజీవ డి. యాదగిరి, ఎం. ప్రేమ్ రాజ్, ప్రవీణ్, జయేం దర్, సి. సిద్ధులు తదితరులు పాల్గొన్నారు.