ఎమ్మెల్యేను కలిసిన మునిగలవీడు రైతులు

– రైతులకు సాగునీరు అందించాలని ఎమ్మెల్యేలు కలిసిన రైతులు
– మునిగలవీడు గ్రామ రైతులు
నవతెలంగాణ నెల్లికుదురు : మండలంలోని మునిగలవీడు గ్రామంలోని మామిడికుంట, నడిమి చెరువులకు ఎస్సారెస్పీ కాలువ ద్వారా నీళ్లు తీసుకువచ్చి చెరువులను నీటిని నింపి రైతు సమస్యలను పరిష్కరించాలని మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళినాయక్ ను కలసిన మునిగలవీడు గ్రామ రైతులు తుపాతురి రాజు ఉగ్గా దేవేందర్ తుపాతురి సతీష్ బొట్టే మురళి బొట్టే బుచ్చయ్య తుప్పతూరి వెంకన్నలు కోరినట్లు తెలిపారు సోమవారం గ్రామానికి చెందిన రైతులు కొంతమంది ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ క్యాంపుకు వెళ్లి సమస్యను పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే ది ఎండాకాలం దృష్ట్యా నీటి ఎద్దడి ఎదురయ్యే అవకాశం ఉందికావున దీనిని పరిగణలోకి తీసుకుని రెండు చెరువులను నీటితో నింపి రైతులను ఆదుకోవాలని తెలిపారు ఈ రెండు చెరువులను ఎస్సారెస్పీ కాల్వ ద్వారా నీటి తీసుకువచ్చి నింపినట్లైతే గ్రామంలోని రైతులు ఎంతోమంది అభివృద్ధి చెందుతారని అన్నారు ఎన్నో ఎకరాలు సాగు లోకి వస్తాయని అన్నారు పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు వెంటనే ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ స్పందించి సంబంధిత అధికారి తో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని చెప్పినట్లు తెలిపారు. వెంటనే రైతుల కళ్ళలో ఆనందం కనిపించిందని అన్నారు.